For Money

Business News

టెలికాంలో 100% విదేశీ పెట్టుబడి

ప్రభుత్వ అనుమతి లేకుండానే టెలికాం రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే టెలికాం కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్‌ (అడ్జస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూ), స్పెక్ట్రమ్‌ బకాయి, ఇంకా చెల్లించని బకాయిలు మరో నాలుగు ఏళ్ళు పాటు చెల్లించకుండా మారటోరియం విధించింది. అంటే నాలుగేళ్ళు ఇవేవి ప్రభుత్వానికి కంపెనీలు చెల్లించాల్సిన పనిలేదు. వొడాఫోన్‌ను పూర్తి బలహీనపర్చిన తరవాత ఇపుడు స్పెక్ట్రమ్‌ చార్జీలను హేతుబద్ధీకరిస్తామని, ఏజీఆర్‌ నుంచి నాన్‌ టెలికాం బకాయిలను మినహాయిస్తామని, పెనాల్టి క్లాజ్‌ను ఏకంగా ఎత్తేస్తామని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. స్పెక్ట్రమ్‌ గడువును 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళకు పెంచినట్లు తెలిపారు. టెలికాం ఎక్విప్‌మెంట్‌ తయారీ రంగానికి ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. అయితే పాకిస్తాన్‌, చైనా దేశాల కంపెనీలు మాత్రం ఆటోమేటిక్‌ రూట్‌లో పెట్టుబడి పెట్టడానికి వీల్లేదని పేర్కొన్నారు.