For Money

Business News

జీఎస్టీ రేట్లలో మార్పుల్లేవ్‌

ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్టీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయరాదని ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. ఈ సమావేశంలో ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంది. పన్ను అధికారులకు ఇపుడు ఉన్న అరెస్టు అధికారాన్ని కౌన్సిల్‌ రద్దు చేసింది. అలాగే ప్రాసిక్యూషన్‌ పరిమితిని కూడా రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచుతూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం నిర్ణయాలను ఆర్థిక మంత్రి మీడియాకు వెల్లడించారు.
👉 ప్రాసిక్యూషన్ పరిమితిని ₹1 కోటి నుండి ₹5 కోట్లకు పెంపు
👉 సాధారణ జరిమానాను ₹25,000 నుండి ₹10,000కు తగ్గించాలని సిఫారసు
👉 ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, రీఫండ్‌ల కోసం విస్తృత అర్హతలను కల్పించాలని నిర్ణయం
👉 రిజిస్ట్రేషన్, కంప్లయన్స్ ప్రక్రియలను మరింత సరళీకరణ
👉 వర్కింగ్ క్యాపిటల్ మెరుగుపరచడానికి త్వరగా రీఫండ్‌ అందేలా చూడాలని సిఫారసు
👉 జీఎస్టీ నోటీసులు, ప్రొసీడింగ్స్ విషయంలో ఉమ్మడి ప్రమాణాలను పాటించాలని నిర్ణయం
👉 రాష్ట్రాల మధ్య వస్తువుల రవాణాను సులభతరం చేయడానికి చర్యలకు జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసింది
👉 ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై చిన్న వ్యాపారస్తుల కోసం సరళీకృత జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ విధానం తేవాలని నిర్ణయం
👉 సేవల ఎగుమతిని సులభతరం చేయడానికి పలు చర్యలను కౌన్సిల్ సిఫార్సు చేసింది
👉 ₹5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న చిన్న వినియోగదారులకు ఓ ఐచ్ఛిక విధానం తేవాలని కౌన్సిల్ సూత్రప్రాయంగా అంగీకరించింది.

Leave a Reply