For Money

Business News

19 శాతం పెరిగిన AI ఆదాయం

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్‌ ప్రకటించిన ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. Q1తో పోలిస్తే ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 72,275 కోట్ల నుంచి రూ. రూ.73,188 కోట్లకు పెరిగింది. గత ఏడాది రూ. 65,799 కోట్లతో పోలిస్తే 11 శాతం పెరిగింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఈసారి నికర లాభం 4 శాతం పెరిగి రూ. 13,884 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12,075 కోట్లతో పోలిస్తే నికర లాభం 15 శాతం వృద్ధి నమోదైంది. ఇవి పూర్తిగా మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. ఇక ఏఐ విభాగం నుంచి వచ్చిన ఆదాయం 310 కోట్ల డాలర్లను మించింది. QoQ పోలిస్తే ఈ ఆదాయం 19 శాతం పెరిగింది. కంపెనీ ఆదాయంలో ఏఐ ఆదాయం వాటా పది శాతానికి చేరడం విశేషం. ఒక్కో షేరుకు రూ.12 చొప్పున రెండో తాత్కాలిక డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. కంపెనీ నుంచి వైదొలగుతున్నవారి శాతం 13.3 శాతంగా ఉన్నట్లు టీసీఎస్‌ ప్రకటించింది. కొత్తగా 4200 మంది ఉద్యోగులను తీసుకున్నామని… దీంతో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5,98,056కు చేరింది.

Leave a Reply