For Money

Business News

క్యాప్‌స్టన్‌లో విజయ్‌, రష్మిక వాటా

హైదరాబాద్‌ కేంద్రంగా సెక్యూరిటీస్‌ సర్వీసెస్‌ అందిస్తున్న క్యాప్‌స్టన్‌ లిమిటెడ్‌లో పెట్టుబడికి ప్రముఖులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా హెం సర్వీసెస్‌ కార్యక్రమాలు ప్రారంభించిన తరవాత చాలా మంది ఈ కంపెనీలో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా నటుడు విజయ్‌ దేవరకొండ, నటి రష్మిక ఇందులో వాటా తీసుకున్నారు. హోం సర్వీసెస్‌పై మరింత పెట్టుబడి పెట్టేందుకు క్యాప్‌స్టన్‌ సర్వీసస్‌లో తన వాటాను ప్రమోటర్‌ కొడాలి శ్రీకాంత్‌ తగ్గించుకుంటున్నారు. తాజాగా విజయ్‌ దేవరకొండ, రష్మికలతో పాటు మరో ఇద్దరికి నాలుగు లక్షల షేర్లు అమ్మినట్లు కంపెనీ ప్రమోటర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొడాలి శ్రీకాంత్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపారు. ఇందులో విజయ్‌, రష్మికలకు చెరో లక్ష షేర్లు అమ్మినట్లు తెలుస్తోంది. బ్లాక్‌ డీల్‌లో ఈ షేర్లు అమ్మినట్లు కంపెనీ ప్రకటించింది. గత వారం 15 లక్షల క్యాప్‌స్టన్‌ షేర్లను నటుడు నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఫ్యామిలీకి కొడాలి శ్రీకాంత్‌ అమ్మారు. ఈ బ్లాక్‌ డీల్స్‌తో క్యాప్‌స్టన్‌లో శ్రీకాంత్‌ వాటా 71 శాతం నుంచి 65 శాతానికి తగ్గింది.ఈ డీల్స్‌ ద్వారా వచ్చిన మొత్తాన్ని హోం సర్వీసెస్‌లో పెడుతున్నట్లు శ్రీకాంత్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో మార్కెట్‌ వాల్యుయేషన్‌లో ఇప్పటికే పేరెంట్ కంపెనీని (క్యాప్‌స్టన్‌ లిమిటెడ్‌) హోమ్ సర్వీసెస్ కంపెనీ (క్యాప్‌స్టన్‌ హోం సర్వీసెస్‌) అధిగమించినట్లు తెలుస్తోంది. క్యాప్‌స్టన్‌లో పెట్టుబడులకు మరికొందరు సెలబ్రిటీల ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసానికి కంపెనీ ఫలితాలను వెల్లడించిన తరవాత… మరోవిడత వాటాల విక్రయం ఉంటుందని భావిస్తున్నారు. ఈసారి కూడా పలువురు సెలబ్రటీలు వాటాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. క్యాప్‌స్టన్‌ హోమ్‌లో బ్రాండ్ అంబాసిడర్‌ అక్కినేని నాగార్జున ఇది వరకే 2 శాతం వాటా తీసుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply