For Money

Business News

ఎన్‌సీసీకి రూ. 1076 కోట్ల ప్రాజెక్టు

ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్‌సీసీకి ఏపీ ప్రభుత్వం నుంచి రూ. 1076 కోట్ల తాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ లభించింది. అనకా పల్లి జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్‌ నుంచి అనకాపల్లి సిగ్మెంట్‌కు తాగునీరు సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఏపీ రూరల్‌ వాటర్‌ సప్లై అండ్‌ శానిటేషన్‌ డిపార్ట్‌మెంట్, వైజాగ్‌ నుంచి తమకు ఈ ప్రాజెక్టు లభించినట్లు ఎన్‌సీసీ వెల్లడించింది. ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది.

Leave a Reply