కుప్పకూలిన మార్కెట్లు
దాదాపు ప్రతి ఒక షేరుకు ప్రతిగా అయిదు షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టి 50లో కేవలం మూడు షేర్లు మాత్రమే గ్రీన్‌లో ఉన్నాయి. దాదాపు మార్కెట్లో ఒక భీతావహ వాతావరణం నెలకొంది. క్రూడ్ ధరలు పెరగడం, మహారాష్ట్రాలో కరువు ప్రకటించడంతోపాటు ఎలాంటి పాజిటివ్ సంకేతాలు లేకపోవడంతో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దాదాపు అన్ని రంగాల షేర్లు ఇవాళ నష్టాల్లో ఉన్నాయి. ఎన్ఎస్ఈ షేర్ ఇవాళ పబ్లిక్ ఆఫర్ ధరకు దిగువకు వచ్చింది. ఇక బ్యాంకు షేర్లపై కూడా ఒత్తిడి పెరిగింది. పలు పీఎస్‌యూ షేర్లు రెడ్‌లో ఉన్నాయి. నిఫ్టి 23000 దిగువకు రావడమే గాక, 22,900 స్థాయిని కూడా బ్రేక్ చేసింది. నిఫ్టిలో డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియాతో పాటు ఎస్బీఐ లైఫ్ షేర్లు మాత్రం గ్రీన్‌లో ఉన్నాయి. హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, మ్యాక్స్ హెల్త్, కొటక్ బ్యాంక్ షేర్లు నిఫ్టి టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. ఇక డెరివేటివ్స్లోకూడా భారీగా నష్టాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా వీక్లీ/మంత్లి డెరివేటివ్స్‌లో కాల్స్ ప్రీమియం కరిగిపోయింది. రేపు నిఫ్టి వీక్లీ క్లోజింగ్ ఉండగా, 23000 వీక్లీ కాల్ ప్రీమియం 75 శాతం క్షీణించి రూ. 56కు పడిపోయింది. వీక్లీ, మంత్లి డెరివేటివ్స్ కూడా రేపే క్లోజ్ అవుతుండటంతో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఇక పుట్ కాంట్రాక్ట్స్ ప్రీమియంలు ఏకంగా 350 శాతం పైగా పెరిగాయి. క్రూడ్ ధరలు తగ్గే పరిస్థితి కన్పించడం లేదు. నవంబర్‌లో ఎన్నికల తరవాత క్రూడ్ ధరలు తగ్గుతాయని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. దేశంలోని ధనిక రాష్ట్రాల్లో ఇపుడు కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కార్పొరేట్ రంగం మూడో త్రైమాసికంలో కూడా రాణించే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
