For Money

Business News

నిఫ్టి ఓకే కానీ…. షేర్లపై దృష్టి పెట్టండి

గిఫ్టి నిఫ్టి స్వల్ప నష్టాలను సూచిస్తున్నా… మార్కెట్‌కు ఇవాళ దిగువస్థాయిలో మద్దతు అందే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య గొడవ కాస్త సద్దుమణిగినట్లు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు చెబుతున్నాయి. అయితే ఈసారి దాడులు జరిగితే మాత్రం పరిస్థితి తీవ్రంగా మారొచ్చు. నిఫ్టి, బ్యాంక్‌ నిఫ్టిలో మంత్లీ కాల్స్‌ తీసుకోవచ్చని చాలా మంది టెక్నికల్‌ అనలిస్టులు సలహా ఇస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో చాలా వరకు నెగిటివ్‌ సంకేతాలు డిస్కౌంట్‌ అయ్యాయి. కాబట్టి మరో పెద్ద ప్రమాదం వస్తే తప్ప… ప్రస్తుతానికి పెద్ద నష్ట భయాలు లేవనే చెప్పాలి. అందుకే నిఫ్టి కన్నా… షేర్లపై దృష్టి కేంద్రీకరించడం బెటర్‌. ఒకవేళ నిఫ్టిపై గురి ఉంటే మంత్లీ కాల్స్‌ తీసుకోవడం బెటర్‌. ఇవాళ జీఎంఆర్‌ ఎయిర్‌ పోర్ట్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ వెలుగులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు షేర్లను పలు బ్రోకింగ్‌ సంస్థలు పదే పదే రికమెండ్‌ చేస్తున్నాయి. అలాగే ఏబీ క్యాపిటల్‌ కూడా. ఇక పైన్‌ ల్యాబ్స్‌నుకొనుగోలు చేయాలని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంటోంది. ఇవాళ ఏఐ, చిప్‌ షేర్లలో కూడా మద్దతు కన్పించవచ్చు. స్థానిక షేర్లలో స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌కు రూ. 400 ప్రాంతంలో గట్టి మద్దతు అందుతోంది. ఇక అపోలో మైక్రో సిస్టమ్స్‌లో భారీ ర్యాలీకి రంగం సిద్ధమౌతోంది. అలాగే క్యాప్‌స్టన్‌ క్రమంగా బలపడుతోంది. ఇక SMS ఫార్మాలో దూకుడు కొనసాగుతోంది. గత శుక్రవారం మాస్‌చిప్‌లో గట్టి మద్దతు కన్పించింది. అలాగే పీవీఆర్‌ వెంచర్స్‌లో కూడా. వీటిలో పాటు INDO MIM షేర్‌ కూడా చాలా గట్టిగా ఉంది.

Leave a Reply