క్రీడలతోనే టీవీలకి రూ. 5,000 కోట్ల యాడ్స్!
ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ ఉండటం.. అలాగే ఒలింపిక్స కారణంగా ఈ ఏడాది టీవీ ఛానల్స్‌కు రూ. 5000 కోట్ల దాకా ప్రకటన ఆదాయం వచ్చే అవకాశముందని ప్రకటన కర్తలు అంచనా వేస్తున్నారు. కరోనా రాకముందు అంటే 2018-19 ఏడాదిలో క్రీడా రంగం నుంచి టీవీకి రూ. 3,500 కోట్ల దాకా యాడ్స్ వచ్చాయి. కరోనాకు ముందు మొత్తం టీవీ రంగానికి రూ. 28,000 కోట్ల యాడ్స్ వస్తే… క్రీడా రంగం నుంచి రూ. 2500 కోట్ల వరకు వచ్చింది.
ఐపీఎల్ నుంచే రూ.2500 కోట్లు
యూఏఈలో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్‌లో టీవీలకు రూ. 2500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. టీ20 వరల్డ్ కప్ ప్రకటనల ఆదాయం రూ. 1,200 కోట్లు కాగా, ఒలింపిక్స్ ద్వారా వచ్చిన ఆదాయం రూ.400 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐపీఎల్14 సీజన్‌లో అధికారిక బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్ ఇండియా.. ఈసారి పది సెకన్ల యాడ్‌ను రూ.14లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్‌కు కూడా ఇదే మొత్తం వసూలు చేయనుందని యాడ్ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.