హైదరాబాద్‌లో టీసీఎస్ డేటా సెంటర్
డేటా సెంటర్ల రంగంలో టీసీఎస్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. తన అనుబంధ కంపెనీ హైపర్‌వాల్ట్ ఏఐ డేటా సెంటర్ హైదరాబాద్‌లో 1 గిగావాట్ (GW) వరకు సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాట్లాడుతూ ప్రతిపాదిత హైపర్‌వాల్ట్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ తెలంగాణతో పాటు దేశానీకి ఒక “చారిత్రాత్మక” అభివృద్ధిగా పేర్కొన్నారు. దీని కోసం కంపెనీ 264 ఎకరాల భూమిని సేకరించింది. హైపర్‌వాల్ట్‌తో పాటు దాని భాగస్వామ్య కంపెనీలు సుమారు రూ. 70,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నారు. దశలవారీగా ఈ ప్రాజెక్టును చేపడతామని టీసీఎస్ పేర్కొంది. ప్రతిపాదిత క్యాంపస్ అధునాతన ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేల్ టెక్నాలజీ సంస్థలకు సేవలు అందించేలా అభివృద్ధి చేస్తామని టీసీఎస్ నివేదిక పేర్కొంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా అభివృద్ధి చెందితే దేశంలోని అతిపెద్ద, అత్యంత అధునాతన ఏఐ ఇన్‌ఫ్రా కేంద్రాలలో ఒకటిగా మారుతుందని టీసీఎస్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్ట్‌తో ఈ ప్రాంతంలో వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను వస్తాయని కంపెనీ, ప్రభుత్వం భావిస్తున్నాయి.
