For Money

Business News

నవంబర్‌ 10న సోనియా పుస్తకం

కాంగ్రెస్‌ పార్లమెంటరీ ఛైర్‌ పర్సన్‌, ఎంపీ సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని భారత్‌లో హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురించనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఇవాళ Xలో తెలిపింది. నవంబర్ 10న తేదీన ఈ పుస్తకాన్ని మార్కెట్‌లోకి తెస్తున్నట్లు వెల్లడించింది. అదే ఈ పుస్తకాన్ని భారత దేశంలో ప్రచురించడానికి పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా వెనుకడుగు వేసిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ పుస్తకాన్ని ఇదే సంస్థ ప్రచురించనుంది. ఈ పుస్తకంలో కొన్ని “సంపాదకీయ మార్పులు” చేయాలని సోనియా గాంధీని కోరగా ఆమె అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. తాము పుస్తకాన్ని ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నా, తాము సూచించిన మార్పులకు సోనియా నిరాకరించడంతో భారత్‌లో తాము ఆ పుస్తకాన్ని తేవడం లేదని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా తెలిపింది.

Leave a Reply