వరల్డ్ మ్యాప్ మారిందోచ్!
వరల్డ్ మ్యాప్ మారుతోంది. ఆఫ్రికా ఖండ పరిమాణాన్ని మరింత కచ్చితంగా ఉండేలా కొత్త మ్యాప్‌తో రానుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం అంగీకారం తెలిపింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కొత్త మ్యాప్ అమల్లోకి రానుంది. ఆఫ్రికా దేశమైన టోగో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్య దేశాలన్నీ అంగీకరించాయి… ఒక్క అమెరికా తప్ప. దీంతో తీర్మానానికి 164 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా అమెరికా వ్యతిరేకించింది. ఆరు దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. 16వ శతాబ్దం నుండి ప్రపంచ వ్యాప్తంగా మెర్కేటర్ మ్యాప్ అమల్లో ఉంది. ఆఫ్రికా ఖండం కంటే 14 రెట్లు పెద్దదైనప్పటికీ, దానిని గ్రీన్‌ల్యాండ్‌తో సమానమైన పరిమాణంలో చూపిస్తున్నారని ఆఫ్రికా దేశాలు ఎప్పటి నుంచో అభ్యంతరం తెలుపుతున్నాయి. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ధి, సామర్థ్యం వాస్తవం కన్నా తక్కువగా అంచనా వేస్తున్నామని విమర్శకులు కూడా అంటున్నారు. 1569లో ఫ్లెమిష్ కార్టో గ్రాఫర్ గెరార్డస్ ఇపుడు అమల్లో ఉన్న మ్యాప్‌ను రూపొందించారు. యూరప్ దేశాల నావికుల ప్రయోజనం కోసం దీన్ని తయారు చేశారు. ఈ పటంలో భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న దేశాలు వాస్తవ పరిమాణం కంటే చిన్నవిగా, ధ్రువాలకు దగ్గరగా ఉన్న దేశాలు కనిపిస్తాయి. వాస్తవం కంటే పెద్దవిగా కన్పిస్తున్నాయి. దీన్ని మార్చాలంటూ 2018లో కార్టో గ్రాఫర్ల బృందం ఒకటి ‘ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్’ అన్న పేరుతో వాస్తవ మ్యాప్‌ను రూపొందించింది. ఆఫ్రికన్ యూనియన్ లోని 54 సభ్య దేశాలు దీనిని ఆమోదించాయి. #CorrectTheMap అని ఆన్లైన్ ద్వారా విస్తృత ప్రచారం కూడా చేశారు.
