For Money

Business News

నేడూ నష్టాలతోనే….

మార్కెట్‌ ఇవాళ కూడా నష్టాలతో ప్రారంభం కానుంది. ప్రతి రోజూ ఉదయం నష్టాల్లో ప్రారంభం కావడం, చివర్లలో లాభాలతో ముగియడం నిఫ్టికి రివాజుగా మారింది. క్లోజింగ్‌లో కూడా నామమాత్రపు లాభాలు ఉండటంతో ట్రేడర్లు ఊసురోమంటున్నారు. CAS తరవాత మార్కెట్‌ లో ఒక రకమైన నిస్తేజ వాతావరణం ఏర్పడింది. చాలా మంది ఇన్వెస్టర్లు, నిపుణులు CAS విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. క్యాష్‌ మార్కెట్‌ పూర్తయిన వెంటనే సూచీలు అనూహ్యంగా పెడరగడం, ఆప్షన్స్‌లో ప్రీమియంలు భారీ పెరగడంతో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అయినా సెబీ తన మొండివైఖరిని వీడటం లేదు. చివరికి ఛానల్స్‌ కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నా స్పందన లేదు. చిన్న ఇన్వెస్టర్లు చితికిపోతుంటే… పెద్ద ఇన్వెస్టర్లు భారీ లాభాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. ఎన్‌విడియా ఫలితాల తరవాత చిప్‌ కంపెనీల షేర్లలో జోష్‌ కన్పిస్తోంది. కోప్సి రెండు శాతం దాకా లాభంతో ఉంది. ఇక మన ఐటీ షేర్లు ఇవాళ నష్టాలతో ప్రారంభం కానున్నాయి. నిన్న కూడా చాలా వరకు ఐటీ షేర్లు నష్టాలతో ముగిశాయి. ఇక మెటల్స్‌లో ఇవాళ లాభాల స్వీకరణ ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక భారీగా పడటం, తరవాత కోలువకోవడం బ్యాంక్‌ నిఫ్టికి అలవాటుగా మారింది. ఇవాళ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మంత్లి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున… చాలా వరకు షేర్లపై ట్రేడింగ్ సాగే ఛాన్స్‌ ఉంది. మార్కెట్‌ను పెద్దగా ప్రభావితం చేసే అంశాలు లేవు.

Leave a Reply