For Money

Business News

హైదరాబాద్‌కు ఎన్‌విడియా బెస్ట్‌ చిప్‌

ప్రపంచంలోని అతి కొన్ని దేశాల్లో ఉన్న 9000 ఎన్‌విడియా వెరా రూబీ చిప్స్‌ హైదరాబాద్‌కు రానున్నాయి. ఎన్‌విడియా తయారు చేస్తున్న అత్యంత శక్తివంతమైన చిప్స్‌లో ఇప్పటి దాకా బ్లాక్‌వెల్‌ ముందుండేది. తాజా ఆ కంపెనీ వెరా రూబిన్‌ను తెచ్చింది. బ్లాక్‌వెల్‌ కంటే పది రెట్లు అధిక ప్రాసెస్‌ సామర్థ్యమున్న వెరా రూబిన్‌ను హైదరాబాద్‌ సెంటర్‌లో పెడుతున్నట్లు AM Intelligence (AMI) కంపెనీ పేర్కొంది. ఏఐ ఇన్‌ఫ్రా రంగంపై దృష్టి పెట్టిన AMI కంపెనీని గ్రీన్‌కో కంపెనీ ప్రమోటర్లు నెలకొల్పారు. హైదరాబాద్‌లో ఈ కంపెనీ ఒక గిగా వ్యాట్‌ కంప్యూటర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ను ఏర్పాటు చేస్తోంది. రానున్న 18 నెలల్లో 200 మెగావాట్ల నెలకొల్పనుంది. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం 800 కోట్ల డాలర్లుగా కంపెనీ పేర్కొంది. తొలుత భారత్‌తో పాటు మలేషియా దేశాల్లో సేవలు అందిస్తామని కంపెనీ ప్రెసిడెంట్‌ మహేష్‌ కొల్లి తెలిపారు. 2028లో ఫిన్లాండ్‌, అమెరికాలకు తమ సేవలను విస్తరిస్తామని అన్నారు. దశలవారీ 5GW సెంటర్‌ను ఏర్పాటు చేయడం కంపెనీ లక్ష్యంగా ఉంది. గ్రీన్‌కో కంపెనీ వ్యవస్థాపకులైన అనిల్‌ చలమశెట్టితో కలిసి AMIని ఏర్పటు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 150 కోట్ల డాలర్లు జపాన్‌ బ్యాంకుల నుంచి సమకూర్చుకుంటామని మహేష్‌ తెలిపారు. అలాగే డేటా సెంటర్ల నిర్మాణం కోసం ివిధ అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి 150 కోట్ల డాలర్లను సమీకరించే బాధ్యతను మోర్గాన్‌ స్టాన్లీకి ఇచ్చినట్లు వెల్లడించారు. నాలుగైదేళ్ళలోనే కంపెనీకి రిటర్న్స్‌ రావడం ప్రారంభమౌతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వ్యయం 50 నుంచి 60 శాతం మొత్తం ఎనర్జీ కోసం వెచ్చించాల్సి ఉంటుందని అన్నారు. విద్యుత్‌ను తక్కువ ధరకు తేవడంలోనే ప్రాజెక్టు లాభదాయకత ఆధారపడి ఉంటుందని అన్నారు.

Leave a Reply