For Money

Business News

దిగువస్థాయిలో మద్దతు?

నిఫ్టి ఇవాళ ఊహించినట్లే నష్టాల్లో ప్రారంభమైంది. ఇపుడు 24128 పాయింట్ల స్థాయి నుంచి కాస్త కోలుకుని 24140 వద్ద ట్రేడవుతోంది. మరో వైపు బ్యాంక్‌ నిఫ్టి దిగువస్థాయి నుంచి కోలుకుని నష్టాలు పూడ్చుకుంది. నిఫ్టి కీలక స్థాయిలో ట్రేడవుతోంది. ఈ స్థాయి నుంచి మద్దతు లభిస్తే …24200స్థాయిని క్రాస్‌ చేసే అవకాశముంది. ఆ స్థాయిని కూడా దాటితే 24250, 24285 స్థాయిలను తాకొచ్చు. లేదంటే నిఫ్టి 24075ని తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే దిగువస్థాయి నుంచి నిఫ్టి పెరిగే ఛాన్స్‌ అధికంగా ఉందని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. మరోవైపు ఇవాళ ఐటీ షేర్లు నిరాశపర్చాయి. భారీ డీల్‌ తరవాత టీసీఎస్‌ నష్టాల్లో ట్రేడవుతోంది. నిఫ్టిలో ఎస్‌బీఐ లైఫ్‌, ట్రెంట్‌, ఎటర్నల్‌, అదానీ ఎయిర్‌పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉన్నాయి. అయితే లాభాలు నామమాత్రమే. నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో సిప్లా ముందుంది. తరవాతి స్థానాల్లో హెచ్‌సీఎల్‌ టెక్‌, అదానీ ఎంటర్‌ప్రైజస్‌, హిందాల్కో, ఏషియన్‌ పెయింట్‌ షేర్లు ఉన్నాయి. షేర్లు పూర్తిగా ఇవాళ్టి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌కు అనుగుణం ఉంటున్నాయి. ఇవాళ్టి పరిణామాలను పట్టించుకోవడం లేదు.

Leave a Reply