For Money

Business News

లలిత లిస్టింగ్‌ జిగేల్‌

లలితా జువలర్స్‌ మార్ట్‌ షేర్‌ ఇవాళ ఆకర్షణీయ లాభంతో లిస్టయింది. ఈ షేర్‌ రూ. 265 వద్ద లిస్టయింది. ఎన్‌ఎస్‌ఈలో రూ. 274.40ని టచ్‌ చేసిన తరవాత ఈ షేర్‌ ఇపుడు రూ. 268 వద్ద ట్రేడవుతోంది. ఒక్కో షేర్‌ను రూ. 201లకు లలితా జువలర్స్‌ కేటాయించింది. ఆఫర్‌ ధరతో పోలిస్తే షేర్‌ 34 శాతం పైగా లాభంతో ట్రేడవుతోంది. షేర్‌కు మంచి డిమాండ్‌ లభిస్తోంది. నిఫ్టి గనుక లాభాల్లో క్లోజయ్యే పక్షంలో ఈ షేర్‌ రూ. 275 పైన క్లోజయ్యే అవకాశాలు కన్పిస్తోంది. ఇవాళ జువలరీ షేర్ల కన్నా గోల్డ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ ధరలు లాభాల్లో ట్రేడవుతున్నందున…జువలరీ, గోల్డ్‌ ఫైనాన్స్‌ షేర్లు గ్రీన్‌లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply