లలితా లిస్టింగ్… నాట్కోకు షాక్
Lalithaa Jewellery Mart: నేడు ప్రీమియంతో లిస్ట్ కానున్న షేర్లు. 66 రెట్లు ఆదరణ పొందిన ఆఫర్. ఒక్కో షేర్‌ను రూ. 201లకు ఆఫర్ చేసిన కంపెనీ
Symbiotec Pharmalab: నేడు ఐపీఓ ప్రారంభం. ధరల శ్రేణి రూ.938-రూ.988. ఇష్యూ సైజ్ రూ. 1757కోట్లు. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ రూ. 1607 కోట్లు
AMAGI: చేతులు మారిన 70 లక్షల షేర్లు, భారీ మొత్తంలో కొనుగోలు చేసిన దేశీ ఫండ్స్
Motisons Jewellers: 65 లక్షల షేర్లు అమ్మిన నిర్మల్‌కుమార్
Shadowfax: 75 లక్షల షేర్లు అమ్మిన Qualcomm Asia Pacific
Aurobindo Pharma: ఆరో పెప్టిడైస్ యూనిట్‌ను సందర్శించిన US FDA అధికారులు. ఒక అబ్జర్వేషన్ నమోదు.
Shree Renuka Sugars: 4.62 కోట్ల షేర్లు విక్రయించిన ICICI Bank
KPI Green Energy: DMGELను రూ. 55.80 కోట్లకు కొనుగోలు చేసిన కంపెనీ
Natco Pharma: వైజాగ్ FDF తయారీ కేంద్రాన్ని పరిశీలించిన US FDA అధికారులు. నాలుగు అబ్జర్వేషన్స్ నమోదు
Caplin Point Laboratories: గుమ్మడిపూండిలోని కంపెనీ యూనిట్‌ను తనిఖీ చేసిన US FDA అధికారులు. పది Form 483 అబ్జర్వేషన్స్ నమోదు.
Premiere Explosives: అపలో మైక్ర సిస్టమ్స్ ఓపెన్ ఆఫరకు సెబీ అనుమతి. రూ. 698 ధరకు 1.39 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్న అపోల మైకరో
Zee Ent: ప్రమోటర్లకు 20.9 కోట్ల ఫుల్లీ కన్వర్టబుల్ వారెంట్ల జారీ. ఒక్కో వారంట్ ధర రూ. 126. వారంట్ల మార్పిడి తరవాత కంపెనీలో 17.9 శాతానికి చేరనున్న ప్రమోటర్ల వాటా.
Diamond Power : ఆరియాన్ప్రొ సొల్యూషన్స్ నుంచి రూ. 52.9 కోట్ల ఆర్డర్? హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ క్యాంపస్‌కు HT, LT ఎలక్ట్రికల్ కేబుల్స్ సరఫరా చేయనున్న కంపెనీ
Acutaas Chemical: గుజరాత్లో రూ. 212 కోట్లతో కొత్త ప్లాంట్
Sigachi Industries : ప్రమోటర్లకు వారెంట్ల జారీ ద్వారా రూ. 290.4 కోట్లు సమీకరణకు బోర్డు ఓకే
