For Money

Business News

మమ్దానీతో రేవంత్‌కు ఏం పని?

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీని కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే అమెరికాకు వెళ్ళకుండా కేంద్రం అడ్డుకుందని వార్తలు వస్తున్నాయి. . రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కు రాజకీయ అనుమతిని కేంద్రం నిరాకరించడానికి ఈ ప్రతిపాదిత సమావేశాలే కీలక కారణమని బీజేపీ నేతలు బాహాటంగా విమర్శిస్తున్నారు. ఇపుడు జాతీయ మీడియా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది. మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆగ్రహంతో ఉన్నా… ఇటీవల వారిద్దరూ భేటీ కూడా అయ్యారు. పైగా మమ్దానీకి గుజరాత్‌ మూలాలు ఉన్నాయి. మరి అలాంటి సమయంలో వీరి భేటీ పట్ల కేంద్రం ఎందుకు విముఖత చూపిందని సోషల్ మీడియాలోపలువురు పోస్టులు పెడుతున్నారు. జేడీ వాన్స్‌తో భేటీపై కూడా కేంద్రం ఎందుకు ఆగ్రహం చెందదని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆయన భార్య తెలుగువారైనపుడు కేంద్రానికి ఎందుకు ఉలుకని కొందరు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే వీరిద్దరి భేటీపై సీఎం రేవంత్‌ రెడ్డి మాత్రం నోరు విప్పడం లేదు. కేవలం విద్యా సంస్థలతో ఒప్పందం కోసమే తన అమెరికా పర్యటన అని ఆయన ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నారు.

Leave a Reply