నేడూ క్రిప్టో జోష్
అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లలో క్రిప్టో కరెన్సీల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఎలాంటి ఎదుగూ బొదుగూ లేకుండా ఉన్న క్రిప్టో కరెన్సీలు ఇపుడు మంచి జోష్ మీద ఉన్నాయి. క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన నిబంధనలకు ఆమోదం తెలపాల్సిందిగా కాంగ్రెస్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరడంతో నిన్న భారీ లాభాలతో క్రిప్టో కరెన్సీలు ముగిశాయి. బిట్‌కాయిన్‌తో సహా దాదాపు అన్ని డిజిటల్ కరెన్సీలు పది శాతంపైగా లాభంతో ముగిశాయి. ఇవాళ కూడా అదే ర్యాలీ కొనసాగుతోంది. ఈ ఏడాది అంతా 60,000 -70,000 డాలర్ల మధ్య ఊగిసలాడిన బిట్ కాయిన్ ఇవాళ 79,600 డాలర్ల స్థాయిని దాటింది. అలాగే స్ట్రాటెజీ కరెన్సీ పది శాతంపైగా లాభపడింది. అలాగే కాయిన్ బేస్ ఏడు శాతం, సర్కిల్ ఇంటర్‌నెట్ గ్రూప్ మరో ఆరున్నర శాతం పెరిగాయి. చెయిన్ లింక్ 9 శాతం పెరిగింది. మారా హోల్డింగ్స్ కూడా ఆరు శాతం, గలాక్సీ డిజిటల్, రాబిన్ హుడ్ మార్కెట్స్ 5 శాతం చొప్పున పెరిగాయి.
