దుమ్మురేపుతున్న గోల్డ్
అంతర్జాతీయ మార్కెట్లలో బులియన్ ధరలు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. అమెరికా మార్కెట్లలో బాండ్ ఈల్డ్స్ స్థిరంగా ఉండటం, డాలర్ ఇండెక్స్ 99లోపే ఉండటంతో బులియన్ మార్కెట్‌లో ర్యాలీ కన్పిస్తోంది. చాలా వరకు మెటల్స్ గ్రీన్‌లో ఉన్నాయి. ఇవాళ అమెరికా మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర ఒకటిన్నర శాతం పెరిగి 4,650 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా 1.36 శాతం పెరిగి 69 డాలర్ల వద్ద ఉంది. దీంతో మన మార్కెట్లలో కూడా ఇదే స్థాయి ర్యాలీ కన్పిస్తోంది. ఎంసీఎక్స్‌లో పది గ్రాముల బంగారం (ఫ్యూచర్స్ కాంట్రాక్ట్) రూ. 1,62,038లను తాకింది. ఇవాళ ధర రూ. 2000లకుపైనే పెరిగింది. ఇక కిలో వెండి ఫ్యూచర్స్ ధర రూ. 2,48,124 వద్ద ఉంది. ఇవాళ వెండి ధర రూ. 3063లు పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 2027లో 5000 డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.
