నిఫ్టికి ఐటీ అండ
చాలా రోజుల తరవాత ఐటీ షేర్లు నిఫ్టికి మద్దతుగా నిలిచాయి. బ్యాంక్ నిఫ్టి అర శాతం దాకా నష్టపోయినా…నిఫ్టి ఆకర్షణీయ లాభంతో క్లోజ్ కావడానికి కారణం ఐటీ, రిలయన్స్, మెటల్స్ షేర్లు. మిడ్ క్యాప్ షేర్ల సూచి కూడా స్వల్ప లాభంతో ముగిసింది. ఉదయం ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17,429 తాకిన నిఫ్టి మిడ్ సెషన్లో 17345కు క్షీణించింది. అక్కడి నుంచి కోలుకుని క్రితం ముగింపుతో పోలిస్తే 54 పాయింట్ల లాభంతో 17,377 పాయింట్ల వద్ద ముగిసింది. ఆరంభంలో గ్రీన్‌లో ఉన్న షేర్లు క్షీణించగా… ఐటీ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
విప్రో 687.50 4.95
హెచ్‌సీఎల్ టెక్ 1,206.00 2.66
ఇన్ఫోసిస్ 1,731.20 1.80
రిలయన్స్ 2,429.00 1.70
హిందాల్కో 468.80 1.63
నిఫ్టి టాప్ లూజర్స్
ఐఓసీ 111.35 -1.55
ఇండస్ ఇండ్ బ్యాంక్ 991.80 -1.19
ఓఎన్జీసీ 121.65 -1.18
బ్రిటానియా 4,080.05 -1.07
కొటక్ బ్యాంక్ 1,775.00 -0.94