For Money

Business News

మినిమమ్‌ ఆర్డర్‌ వ్యాల్యూ పెంపు

జెప్టో కంపెనీ తన ఆర్డర్‌ మినిమమ్‌ వ్యాల్యూ (MOV)ని పెంచేసింది. ఇపుడు MOV రూ.149 కాగా, దీన్ని రూ. 199కి పెంచినట్లు జెప్టో వెల్లడించింది. డిమాండ్‌ మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో MOV రూ. 299కి పెంచుతున్నట్లు పేర్కొంది. ఇటీవల MOVని రూ. 99 నుంచి రూ. 149కి పెంచింది. మార్కెట్‌ షేర్‌ను పెంచుకునేందుకు, త్రైమాసిక నష్టాలు తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎలాంటి డెలివరీ చార్జీలు లేకుండా ఆర్డర్‌ ఇచ్చేందుకు MOVని క్విక్‌ కామర్స్‌ సంస్థలు నిర్ణయిస్తూ ఉంటాయి. జెప్టో నిర్ణయం ఆ కంపెనీకి మేలు చేస్తుందని బ్రోకింగ్‌ సంస్థ కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. స్విగ్గీకి బై రేటింగ్‌ ఇస్తూ … టార్గెట్‌ రూ. 370గా పేర్కొంది. అలాగే ఎటర్నల్‌ (జొమాటొ) టార్గెట్‌ రూ. 395గా ఉంచింది.

Leave a Reply