లాభాల్లో నాస్‌డాక్
వాల్‌స్ట్రీట్‌లోని ప్రధాన సూచీలన్నీ ఇవాళ గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా నాస్‌డాక్ 0.68 శాతం లాభంతో ట్రేడవుతోంది. డౌజోన్స్ 0.04 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.33 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. అమెరికా రీటైల్ ద్రవ్యోల్బణం అంచలకన్నా తక్కువగా ఉండటంతో స్టాక్ మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. దీంతో ఇక ఇప్పట్లో వడ్డీ పెరగవన్న అంచనాతో డాలర్ ఇండెక్స్ తగ్గింది. మరోవైపు క్రూడ్ ధరలు రెడ్‌లో ఉన్నా బ్రెంట్ క్రూడ్ ఇంకా 88 డాలర్లపైనే ఉంది. హర్ముజ్‌పై అమెరికా, ఇరాన్‌ల మధ్య ఎలాంటి రాజీ కుదరకపోవడంతో క్రూడ్ ధరలు అధికంగానే ఉన్నాయి. వడ్డీ రేట్లు పెరగవన్న వార్తలతో బులియన్ గ్రీన్‌లో ఉంది. ఔన్స్ బంగారం ధర ఇపుడు 4467 డాలర్ల ప్రాంతంలో ఉంది. ఇక వెండి ధర కూడా 65.65 డాలర్ల వద్ద ఉంది.
