For Money

Business News

జియో క్రెడిట్‌లో BofA వాటా

జియో ఫైనాన్షియల్‌ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ జియో క్రెడిట్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వాటా తీసుకుంది. సుమారు రూ. 18,268 కోట్లు చెల్లించి 49.9 శాతం వాటాను బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తీసుకోనుంది. ఈ మేరకు రెండు కంపెనీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ప్రిఫరెన్షియల్‌ షేర్లు, వారెంట్ల జారీ ద్వారా అమెరికా సంస్థ ఈ పెట్టుబడి పెట్టనుంది. తొలుత జియో క్రెడిట్‌ ఈక్విటీలో 26.5 శాతం వాటాను షేర్ల జారీ ద్వారా కేటాయిస్తారు. తరవాత వారెంట్లను మార్చుకోవడం ద్వారా వాటా 49.9 శాతానికి చేరుతుంది. తమ గ్రూప్‌కు ఉన్న డిజిటల్‌ సామర్థానికి బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంతర్జాతీయ అనుభవం తోడవుతుందని జియో ఫైనాన్స్‌ పేర్కొంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జాతీయ స్థాయిలో క్రెడిట్‌ వ్యాపారాన్ని విస్తరిస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేష్‌ అంబానీ తెలిపారు.

Leave a Reply