రష్యా చమురు కొంటే… 100%టారిఫ్
రష్యా నుంచి చమురు కొనుగోలు దేశాలపై వంద శాతం టారిఫ్ విధించే చట్టానికి సెనేట్ ఆమోదం తెలిపింది. 86-11తో ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఇక దీన్ని కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంది. భారత్, చైనా, స్లోవాకియా, అజర్బైజాన్ దేశాలపై ఈ టారిఫ్ విధిస్తారు. అయితే ఈ పన్ను ఎంత వరకు వేయాలని, ఏయే దేశాలపై వేయాలనే అంశంపై అధ్యక్షుడు ట్రంప్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఈ అయిదు దేశాల్లో కొన్నింటిని మినహాయించే అధికారం ట్రంప్‌కు ఉంటుంది. అలాగే టారిఫ్ కూడా వంద శాతం వరకు అంటే ఆయన ఇష్టం ఉన్నంత వరకు వేయొచ్చు. హర్ముజ్ వ్యవహారంపై ఇంకా గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో క్రూడ్ సుమారు 80 నుంచి 90 డాలర్ల మధ్య కదలాడుతోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి పలు దేశాలు చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే ఇటీవల రష్యా కూడా డిస్కౌంట్‌కు చమురు ఎగుమతి చేయడం ఆపేసింది. సో… దీనివల్ల తక్షణ ముప్పు ఏయే దేశాలకు ఉంటుందో చూడాలి. ఇపుడు చాలా దేశాలు అమెరికా లేదా అమెరికా ఒత్తిడితో వెనుజులా నుంచి క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి.
