For Money

Business News

ఫార్చూన్‌పై కొరడా

దేశ వ్యాప్తంగా కల్తీ ఆహారపదార్థాల సరఫరాపై FSSAI దాడులు నిర్వహించింది. నిర్ణీ ప్రమాణాలకు అనుగుణంగా లేని ఉత్పత్తులపై కొరడా ఝుళిపించింది. డాబర్‌తో పాటు AWL ఆగ్రో బిజినెస్‌ వంటి కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. డాబర్‌ కంపెనీకి ఇచ్చిన ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. మరోవైపు గోవాలో సేకరించింన సన్‌ఫ్లవర్‌ ఫ్రైవోలా రీఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై FSSAI నిషేధం విధించింది. గోవాలోని ఒక రిసార్ట్‌ నుంచి సేకరించి ఈ ఆయిల్‌ ప్యాకెట్‌లోని పదార్థాలు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తమ పరీక్షల్లో తేలినట్లు స్పష్టం చేసింది. కంపెనీ అప్పీల్‌ మేరకు మళ్ళీ పరీక్షలు నిర్వహించింది. అయినా అందులో నిర్ణీత ప్రమాణాలకన్నా తక్కువగా A, D విటమిన్లు ఉన్నట్లు తేల్చింది. దీంతో ఈ నూనె విక్రయంపై నిషేధిస్తూ నోటీసు జారీ చేసింది.

Leave a Reply