For Money

Business News

NBFC షేర్లపై ఒత్తిడి

ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల లోన్‌ రికవరీలకు సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ సడలించడంతో ఇవాళ ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. ముఖ్యంగా ఫోర్లు, ల్యాప్‌టాప్‌లు వంటి పరికరాలను ఫైనాన్స్‌ చేసే బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్‌ ఇవాళ రికార్డుస్థాయిలో 4.5 శాతం పైగా నష్టంతో ట్రేడవుతోంది. ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ వంటి షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. శ్రీరామ్‌ ఫైనాన్స్‌ మాత్రం ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇదే సమయంలో టాటా క్యిపటల్‌ 1.7 శాతం నష్టపోయింది. ఈ షేర్లు ప్రస్తుత స్థాయిలో కొనుగోలు చేయొచ్చని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఇక్కడి నుంచి ఏ మాత్రం తగ్గినా… కొనుగోలుకు మంచి ఛాన్స్‌గా తెలిపాయి. ఆర్బీఐ నిబంధనల వల్ల లోన్ల రికవరీలో పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇక నిఫ్టి స్థిరంగా 24620 ప్రాంతంలో ట్రేడవుతోంది. దాదాపు క్రితం స్థాయి వద్దే ట్రేడవుతోంది.

Leave a Reply