For Money

Business News

స్పేస్‌ ఎక్స్‌ షేర్‌ ఢమాల్‌

ఎలాన్‌ మాస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహపర్చాయి. వాల్‌స్ట్రీట్‌లో లిస్టింగ్‌ తరవాత తొలిసారి కంపెనీ ఫలితాలు ప్రకటించింది. మార్కెట్‌ అంచనాలకు మించి కంపెనీ 781 కోట్ల డాలర్ల ఆదాయం చూపినా… భారీ వ్యయ భారం ఇన్వెస్టర్లను భయపెడుతోంది. అలాగే ఒక్కో షేర్‌కు నష్టం కూడా 0.34 డాలర్ల నుంచి 0.09కి తగ్గినా…కంపెనీ ఫ్రీ క్యాష్‌ ఫ్లో బాగా తగ్గడంతో ఇన్వెస్టర్లు ఈ షేర్‌లో అమ్మకాలు పెంచారు. దీంతో షేర్‌ ధర ఒకదశలో 12 శాతం క్షీణించి ఇపుడు 8 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఈ కంపెనీ ఏఐ విభాగం నుంచి ఆదాయం మాత్రం 247 శాతం పెరిగి 260 కోట్ల డాలర్లకు చేరడం విశేషం. అలాగే కంపెనీకి ఎన్‌విడియా చిప్స్‌ వాడుతామని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించడంతో… ఎన్‌విడియా షేర్‌ నాలుగు శాతంపైగా పెరగ్గా, ఏఎండీ షేర్‌ ఆరు శాతం క్షీణించింది. ఐటీ షేర్లు డల్‌గా ఉండటంతో నాస్‌డాక్‌ 0.33 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అయితే డౌజోన్స్‌ మాత్రం 0.78 శాతం లాభంతో పరుగులు పెడుతోంది.

Leave a Reply