రూ. 4 లక్షల కోట్ల బాదుడు?
దేశ చమురు నిల్వల సామర్థ్యం పెంచేందుకు కేంద్రం ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. వంట గ్యాస్‌తో పాటు నేచురల్ గ్యాస్ నిల్వల సామర్థ్యం పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటి వరకు మన దేశంలో 53.3 లక్షల టన్నుల క్రూడ్ నిల్వ సామర్థ్యం ఉండగా, మరో 65 లక్షల టన్నుల క్రూడ్ సామర్థ్యం నిర్మాణదశలో ఉంది. అయితే ఎల్‌పీజీ, పీఎన్‌జీ నిల్వ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. వీటిని కేవలం పది రోజుల వరకు మాత్రమే నిల్వ చేసుకునే వీలుంది. దీన్ని భారీ పెంచేందుకు ప్లాన్ చేసింది. రానున్న పదేళ్ళలో 2.80 కోట్ల టన్నుల క్రూడ్, 90 లక్షల టన్నుల ఎల్‌ఎన్‌జీ, 40 లక్షల టన్నుల పీఎన్‌జీ నిల్వ సామర్థ్యం ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం కనీసం కనీసం రూ. 4 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ మొత్తాన్ని లెవీల రూపంలో జనం నుంచి వసూలు చేయాలని ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కో సిలెండర్‌పై రూ. 18ల లెవీ వేయాలని యోచిస్తోంది. అలాగే క్యూబిక్ మీటర్‌కు రూ.1.43చొప్పున భారం వేయాలని భావిస్తోంది. దీనివల్ల ఏటా రూ 140 కోట్లకు పైగానే వసూలు అవుతాయని అంచనా. అయితే ఈ మొత్తాన్ని ఎప్పటి నుంచి వేయాలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. లెవీ ద్వారా వచ్చే సొమ్ము ద్వారా దశలవారీగా నిల్వల సామర్థ్యం పెంచుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
