మళ్ళీ నష్టాలతో….
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిందని భావిస్తున్న కాల్పుల విరమణ అపుడే ప్రమాదంలో పడింది. ఈ ఒప్పందంలో లెబనాన్ లేదని అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు ఈ చర్చల్లో తనకు పాత్ర లేదని… తాను దాడులు కొనసాగిస్తానని ఇజ్రాయిల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో అమెరికా ఫ్యూచర్స్, ఆసియా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. గిఫ్ట్ నిఫ్టి కూడా నష్టాల్లో ఉంది. నిన్న 24,000 స్థాయిని నిఫ్టి టచ్ చేసింది. ఇవాళ అదే ప్రధాన అవరోధంగా మారింది. ఇవాళ సెన్సెక్స్ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు. ఈ నేపథ్యంలో మార్కెట్లో దిగువస్థాయికి మద్దతు అందుతుందా లేదా అనేది చూడాలి. 23700 స్టాప్లాస్తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని కొందరు అనలిస్టులు అంటున్నారు. క్రూడ్ ధరలు ఇపుడు మార్కెట్ గతిని నిర్దేశించనున్నాయి. మార్కెట్ క్లోజింగ్ తరవాత టీసీఎస్ ఫలితాలు రానున్నాయి.
