లాభాల్లో అమెరికా ఫ్యూచర్స్
రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్ దాదాపు ఒక శాతం దాకా నష్టంతో ముగిశాయి. ముఖ్యంగా ఆంథ్రోపిక్ తాజా టూల్స్ ఇతర ఐటీ కంపెనీలను దెబ్బతీస్తోంది. ఎస్ అండ్ పీ 500 సూచీ మాత్రం 0.37 శాతం, డౌజోన్స్ కేవలం 0.18 శాతం నష్టంతో ముగిశాయి. అయితే ఇవాళ ట్రంప్ చేసిన ప్రకటన, న్యూయార్స్ టైమ్స్ కథనంతో అమెరికా ఫ్యూచర్స్ భారీ లాభాల్లోకి ట్రేడవుతున్నాయి. డౌజోన్స్ 400పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది. అలాగే ఎస్ అండ్ పీ 500 కూడా ఒక శాతం దాకా లాభంతో ఉంది. అయితే బాండ్ ఈల్డ్స్‌లో మాత్రం పెద్దగా తేడా లేదు. కేవలం మార్కెట్‌లో వదంతులు, మీడియా కథనాల ఆధారంగా మార్కెట్ ట్రేడవుతోంది. మరోవైపు ఆయిల్ ధరలు కూడా ఆరు శాతం తగ్గాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ 98 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
