For Money

Business News

నెల రోజుల విరామం?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఓ భారీ బహుమానం తనకు అందిందని ఆయన చెప్పారు. ఓవల్‌ ఆఫీస్‌లో ఆయన మాట్లాడుతూ యుద్ధ విరమణ దశగా చర్చలు జరుగుతున్నాయని, ఇవి కొలిక్కి వచ్చే వరకు నెల రోజుల పాటు విరామం ప్రకటించే అవకాశముందని అన్నారు. అయితే ఇరాన్‌ నుంచి వచ్చిన బహుమానం గురించి ఎలాంటి వివరాలు ఆయన వెల్లడించలేదు. గ్యాస్‌, ఆయిల్‌కు సంబంధించిన అంశమని మాత్రం వెల్లడించారు. తాను సూచించిన ప్రతినిధులతో సజావుగా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా ఈచర్చల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇరాన్‌, అమెరికా మధ్య ఫలప్రదమైన చర్చలు సాగుతున్నాయని అన్నారు.

Leave a Reply