For Money

Business News

నిఫ్టి నేటి లాభాలకు ట్రంప్‌ ముప్పు?

ఇరాన్‌తో చర్చలు నిజమా? కాదా? అన్న చర్చ మార్కెట్‌లో జరుగుతున్నా… ప్రస్తుతానికి అయిదు రోజుల పాట దాడులు ఉండవన్న అమెరికా ప్రకటన మార్కెట్‌కు ఊరట లభించింది. ఇవాళ గిఫ్టి నిఫ్టి 350 పాయింట్లకుపైగా లాభంతో ఉంది. మరి నిఫ్టి ఇదే స్థాయిలో లాభాలతో ప్రారంభం అవుతుందా? ప్రారంభమైనా లాభాలు ఉంటాయా? అన్న చర్చ ఇపుడు మార్కెట్‌లో నడుస్తోంది. ఎందుకంటే క్రూడ్‌ మళ్ళీ 103 డాలర్లకు చేరడంతో చమురు భయం కొనసాగుతోంది. పైగా ఇవాళ నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది. నిన్న రూ.14.3 లక్షల కోట్ల మేర మార్కెట్‌ క్యాప్‌ తగ్గింది. యుద్ధ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు భారత మార్కెట్‌ క్యాప్‌ రూ.49 లక్షల కోట్లు తగ్గింది. వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా షార్ట్‌ కవరింగ్‌ వస్తుందేమో చూడాలి. వస్తే చివరి వరకు కొనసాగుతాయా? మరోవైపు డాలర్‌తో రూపాయి ఇవాళ 94ని క్రాస్‌ చేసే అవకాశముంది. కాబట్టి డే ట్రేడింగ్‌ చేసేవారు ఎప్పటికపుడు లాభాలు స్వీకరించడం మేలు. ఎందుకంటే ట్రంప్‌ ప్రకటన నిజమైతే… బ్రెంట్‌ క్రూడ్‌ ఈపాటికీ కనీసం 80 డాలర్లకు పడాల్సింది. కాబట్టి యుద్ధంపై క్లారిటీ వచ్చే వరకు పొజిషనల్‌ ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి.