For Money

Business News

ట్రంప్ వెనకడు…

ట్రంప్‌ అంటే తిక్కలోడు. ఎపుడు ఎలా ఉంటాడో? ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. హర్మూజ్‌ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని లేదంటే అంతు చూస్తానని బెదిరించి ఇంకా 24 గంటలు కూడా కాలేదు… అపుడే మాట మార్చారు. ఇరాన్‌లోని విద్యుత్‌ కేంద్రాలను కూడా మటాష్‌ చేస్తానని హెచ్చరించిన పెద్దమనిఫి ఇపుడు కొత్త డ్రామా మొదలెట్టాడు. యుద్ధం నిలిపివేతపై ఇరాన్‌తో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నామని, అవి ఫలప్రదంగా ముందుకు సాగుతున్నాయని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్‌ ఎనర్జి ఇన్‌ఫ్రా, విద్యుత్‌ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి దాడులే చేస్తే పశ్చిమాసియాలో తాగు నీరు లేకుండా చేస్తానని ఇరాన్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ట్రంప్‌ ప్రకటన తరవాత క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గాయి. పది శాతం తగ్గి 96 డాలర్ల చేరువలో బ్రెంట్‌ క్రూడ్‌ ట్రేడవుతోంది. ఇరాన్‌ నాయకత్వం గురించి ఉన్న ఆప్షన్స్‌పై ఆదేశ నేతలతో చర్చలు జరిపినట్లు ట్రంప్‌ అన్నట్లు అల్ జజీరా ఛానల్‌ పేర్కొంది.సాధ్యమైనంత త్వరగా తగినంత ఆయిల్‌ ప్రపంచదేశాలకు అందుబాటులోకి రావాలని ట్రంప్‌ అంటున్నారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ బతికే ఉన్నారా లేదా అన్న అంశంపై తనకు క్లారిటీ లేదని ట్రంప్‌ తెలిపారు. చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని ఆయన అన్నారు. చర్చల గురించి ఇరాన్‌ నేతలే తనకు ఫోన్‌ చేశారని ట్రంప్‌ అన్నారు.