For Money

Business News

రూ.1.4 లక్షల దిగువకు పసిడి!

ఒకవైపు డాలర్‌ బలంగా ఉండటం మరోవైపు ట్రెజరీ బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఇపుడు బంగారంపై ఆసక్తి తగ్గించారు. నాన్‌ గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇష్టపడేవారు ఇపుడు ట్రెజరీ బాండ్స్‌వైపు వెళుతున్నారు. అలాగే డాలర్‌ బలంగా ఉండటం కూడా మరో బలమైన కారణంగా కాగా, ఇప్పట్లో అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్‌ లేదన్న వార్తలు కూడా బంగారంపై ఒత్తిడి పెంచుతోంది. గతవారం బంగారంలో వచ్చిన కరెక్షన్‌ గత 40 ఏళ్ళలో ఎన్నడూ రాలేదు. అంత ఫాస్ట్‌గా పడింది. ఈ ఏడాది 5626 డాలర్లు పలికిన ఔన్స్‌ బంగారం ధర ఇపుడు 4400 డాలర్లకు చేరింది. ఇవాళ ఉదయం 4355 డాలర్లను కూడా తాకింది. అంటే ఇవాళ నాలుగున్నర శాతం తగ్గింది బంగారం. ఇక మన ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో గత శుక్రవారం పది గ్రాముల కాంట్రాక్ట్‌ రూ. 1.45 లక్షల వద్ద ముగిసింది. ఇవాళ మన మార్కెట్‌లో మరో 4 శాతంపైగా నష్టంతో ప్రారంభం కానుంది. అంటే రూ. 1.4 లక్షల సమీపంలో లేదా అంతకన్నా దిగువకు వచ్చే ఛాన్స్‌ ఉంది. అమ్మకాల ఒత్తిడి వచ్చినపుడు స్పాట్‌ మార్కెట్‌లో ధరలు మరింత భారీగా క్షీణించే అవకాశముంది.

Leave a Reply