For Money

Business News

తగ్గినా… లాభాల్లోనే…

మార్కెట్‌ ఇవాళ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఉదయం ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైనా… తరవతా 23,345 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. కాని మిడ్‌ సెషన్‌ సమయానికి చాలా వరకు లాభాలను కోల్పోయింది. యూరప్‌ మార్కెట్‌లు గ్రీన్లో ఉండటం, కాస్త పెరిగింది. కాని సెషన్‌ ముగింపులో వీకెండ్‌ భయం వెంటాడింది. ఒకదశలో 23067 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడింది. వారాంతంలో యుద్ధంలో ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న టెన్షన్‌ ఇన్వెస్టర్లలో ఉంది. అలాగే డాలర్‌తో రూపాయి పతనం జోరుగా ఉండటం కూడా మరో కారణం. వెరశి 113 పాయింట్ల లాభంతో 23114 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. బ్యాంక్‌, ఫైనాన్స్‌ షేర్లలో ఎలాంటి ఉత్సాహం లేదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇవాళ కూడా మరోరెండు శాతం తగ్గింది. అలాగే ఎన్‌బీఎఫ్‌సీలలో కూడా ఒత్తిడి కొనసాగింది. బజాజ్‌ ఫైనాన్స్‌ ఒకదశలో రూ. 819ని తాకింది. యుద్ధం కారణంగా పెరుగుతాయని భావించిన డిఫెన్స్‌ షేర్లు కూడా నీరసంగా ముగిశాయి. ముడి చమురు ధరలు ఇవాళ మొత్తం తగ్గకపోవడంతో ఇన్వెస్టర్ల ఆశలు సన్నగిల్లాయి. కొత్తగా పొజిషన్స్‌ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. చాలా మంది టెక్నికల్‌ అనలిస్టులు కూడా ఇప్పట్లో దీర్ఘ కాలికతో పాటు స్వల్ప కాలిక పొజిషన్లు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇవాళ నిఫ్టి 50లో టాప్‌ గెయినర్ష్‌గా టెక్‌ మహీంద్రా, JSW స్టీల్‌, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌ నిలిచాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, శ్రీరాం ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఓఎన్‌జీసీ టాప్‌లో నిలిచాయి.

Leave a Reply