మళ్ళీ చమురు జంప్…
భారత్ వంటి వర్ధమాన దేశాలకు కునుకు లేకుండా చేస్తోంది ఆయిల్ మార్కెట్. కరోనా సమయంలో లేని పరిస్థితి. అపుడు కుప్పకూలిన ఆయిల్ మార్కెట్. ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ లేని పరిస్థితి. కేవలం క్రూడ్ ధరలు మాత్రమే పెరిగాయి. ఇపుడు క్రూడ్ ధరలతో పాటు డాలర్ పెరగడం పెద్ద సమస్యగా మారింది. అదే సమయంలో నౌకల రవాణా ఖర్చు భారీగా పెరిగింది. బీమా కూడా ప్రియమైంది. దీంతో మన రేవులకు వచ్చేసరికి తడిసిమోపెడవుతోంది. ఇక గ్యాస్ కష్టాలు సరేసరి. దీంతో భారత వాణిజ్య లోటు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. నిన్న 106 డాలర్లకు చేరి బ్రెంట్ క్రూడ్ చుక్కులు చూపింది. కాని రాత్రి మళ్ళీ వంద డాలర్లకు చేరింది. ఇక నుంచి చమురు ధరలు తగ్గుతాయని భావిస్తున్న తరుణంలో ఇరాన్ షాక్ ఇచ్చింది. దుబాయ్ ఎయిర్పోర్టుపై దాడితో చమురు ధరలు మళ్ళీ పెరిగాయి. హర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రవాణాను సాధారణ స్థాయికి తెచ్చేందుకు సాయం రావాలని కోరిన ట్రంప్ విజ్ఞప్తికి ఎవరూ ముందుకు రావడంలో. ఈ గోల మాకెందుకు అని యూరప్ దేశాలు ప్రకటించడంతో బ్రెంట్ కూడా మళ్ళీ 104 డాలర్లకు చేరింది. వాస్తవానికి ఇదే ధరకు రష్యా కూడా అమ్ముతోంది. తమ దేశంపై ఇపుడు ఆంక్షలు లేనందు వల్ల మార్కెట్ ఇవ్వాల్సిందేనని అంటోంది. ఈ ధరకు క్రూడ్ కొని ఇతర మార్గాల ద్వారా భారత్కు చేరేందుకు తడిసిమోపెడవుతుంది. దీంతో మన మార్కెట్లలో మళ్ళీ టెన్షన్ మొదలైంది.
