రాత్రి లాభాలు.. ఉదయం నష్టాలు
నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఒక శాతంపైగా లాభంతో నాస్‌డాక్ క్లోజైంది. ఎస్ అండ్ పీ 500 కూడా అదే జోరు ప్రదర్శించింది. మెటాలో 20 శాతం ఉద్యోగాలపై కోత పడుతుందన్న వార్త టెక్ కంపెనీలకు పాజిటివ్‌గా నిలిచింది. మరోవైపు ఎకానమీ షేరలకు కూడా మద్దతు లభించింది. అయితే రాత్రి తగ్గినట్లే తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు ఇపుడు మళ్ళీ పెరిగాయి. రాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడి చేయడంతో చమురు ధరలు మళ్ళీ పెరిగాయి. ఇపుడు బ్రెంట్ క్రూడ్ 104 డాలర్లకు చేరడంతో అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. మరి దీని ఎఫెక్ట్ మన మార్కెట్‌పై ఎలా ఉంటుందో చూడాలి.
