For Money

Business News

నెట్‌ఫ్లిక్స్‌ చేతికి వార్నర్‌ బ్రదర్స్‌

ఎట్టకేలకు వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ స్టూడియోస్‌ కోసం వారం రోజుల పాటు సాగిన బిడ్డింగ్‌ ముగిసింది. 7200 కోట్ల డాలర్లకు నెట్‌ఫ్లిక్స్‌ చేజిక్కించుకుంది. టీవీ, సినిమా, స్టూడియోలతో పాటు స్ట్రీమింగ్‌ డివిజన్‌ కూడా ఉన్న వార్నర్ బ్రదర్స్‌ కోసం పారామౌంట్‌ చివరిదాకా పోరాడింది. వార్నర్‌ బ్రదర్స్‌కు చెందిన ఒక్కో షేరుకు 24 డాలర్లు ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే 28 డాలర్లు ఇచ్చి నెట్‌ఫ్లిక్స్‌ విజేతగా నిలిచింది. గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌, డీసీ కామిత్స్‌తో పాటు హారిపోటర్‌ వంటి మెగా హిట్స్‌ ఉన్న వార్నర్‌ బ్రదర్స్‌కు HBO మ్యాక్స్‌ స్ట్రీమింగ్‌ డివిజన్‌ కూడా నెట్‌ఫ్లిక్స్‌ చేతికి వచ్చింది. HBO మ్యాక్స్‌ స్ట్రీమింగ్‌కు ఏకంగా 13 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారు. ఒకేసారి నెట్‌ఫ్లిక్స్‌ చేతికి భారీ సినిమా లైబ్రరీ తన చేతికి దక్కింది. నెట్‌ఫ్లిక్స్‌ చేతికి వార్నర్‌ బ్రదర్స్‌ వెళ్ళడంపై పారామౌంట్‌ అధినేత డేవిడ్‌ ఎలిసన్‌ చాలా ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్‌కు సన్నిహిత వ్యక్తుల్లో ఒకరైన ఎలిసన్‌ చివరి వరకు బిడ్డింగ్‌లో ఉన్నారు.