For Money

Business News

డ్రోణాచార్యపై నిషేధం

డ్రోణాచార్య ఏరియల్‌ ఇన్నోవేషన్స్‌ కంపెనీపై సెబి నిషేధం. బీఎస్‌ఈలోని SME విభాగంలో ట్రేడ్‌ ఈ షేర్‌ ట్రేడవుతోంది. కంపెనీతో పాటు మార్కెట్‌లో ప్రవేశించకుండా ప్రమోటర్లపై కూడా సెబి నిషేధించింది. 2022 డిసెంబర్‌లో ఐపీఓ ద్వారా రూ. 33.96 కోట్ల సమీకరించిన ఈ కంపెనీ… ఆ తరవాత పలు అక్రమాలకు పాల్పడిందని సెబీ అంటోంది. ఇష్యూ తరవాతి కాలానికి సంబంధించిన రికార్డులను సెబీ పరిశీలించింది. ఐపీఓ నిధుల్లో దాదాపు 80 శాతం దాకా నిధులు అంటే రూ. 27.28 కోట్ల నిధులను దారి మళ్ళించినట్లు సెబీ గుర్తించింది. పలు అంశాలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అధికారులను సమర్పించినట్లు కూడా సెబీ పేర్కొంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 33.96 కోట్లు సమీకరించగా కేవలం రూ. 70 లక్షలను మాత్రమే డ్రోన్లు, సంబంధిత పరికరాల కొనుగోలు కోసం ఉపయోగించినట్లు సెబీ వెల్లడించింది.