For Money

Business News

సూపర్‌ ఓపెనింగ్‌

ఇవాళ భారత స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యే ఛాన్స్‌ కన్పిస్తోంది. గిఫ్ట్‌ నిఫ్టి ప్రస్తుతం 120 పాయింట్ల లాభంతో ఉంది. గత శుక్రవారం వాల్‌స్ట్రీట్‌ కూడా లాభాల్లో ముగిసింది. మరోవైపు చైనాలో జపాన్‌ మినహా ఇతర మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు వడ్డీ రేట్ల తగ్గింపును డిస్కౌంట్‌ చేస్తోంది. మన దేశంలో కూడా వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గిస్తుందని భావిస్తున్నారు. దీంతో బ్యాంక్‌, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లకు గట్టి మద్దతు లభిస్తోంది. ఆయిల్‌ సరఫరా తగ్గిస్తామని ఒపెక్‌ ప్లస్‌ దేశాలు నిర్ణయించడంతో క్రూడ్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభం కానుంది.