డిసెంబర్ సూపర్ ప్రారంభం
డిసెంబర్ నెల డెరివేటివ్స్ ఇవాళ భారీ లాభాల్లో ప్రారంభం కానున్నాయి. గిఫ్ట్ నిఫ్టి ఇపుడు వంద పాయింట్లకు పైగా లాభంలో ఉంది. నిన్న రాత్రి వాల్‌స్ట్రీట్ లాభాల్లో ముగిసింది. డిసెంబర్లో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే వార్తలు పెరుగుతున్నాయి. పైగా నిన్న వచ్చిన రీటైల్ సేల్స్ డేటాతో పాటు బలహీన ద్రవ్యోల్బణంతో వడ్డీ రేట్లను తగ్గిస్తారన్న వాదనకు మరింత బలం చేకూరింది. నిన్న రాత్రి డౌజోన్స్ ఒక శాతంపైగా లాభంతో ముగిసింది. లాభాల్లోనే నాస్డాక్ కొనసాగింది. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు వచ్చిందన్న వార్తలతో క్రూడ్ భారీగా తగ్గింది. ఆసియా మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభం కానున్నాయి.
