స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నా మన మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి. నష్టాలు నామమాత్రంగానే ఉన్నాయి. అంతకుమునుపు యూరో మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అయితే లాభనష్టాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. అలాగే హాంగ్‌సెంగ్ కూడా. గ్రీన్‌లోఉన్నా లాభాలు నామమాత్రమే. ఇక సింగపూర్ నిఫ్టి 40 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి.