గ్రో ఐపీఓకు అనుమతి?

ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ గ్రో కంపెనీ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. గత మే నెలలో కంపెనీ ఐపీఓ కోసం రహస్య ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద దాఖలు చేసింది. మార్కెట్ నుంచి వంద కోట్ల డాలర్లు అంటే సుమారు రూ. 8700 కోట్లు సమీకరించేందుకు కంపెనీ ప్రైమరీ మార్కెట్‌కు రానుంది. కంపెనీ వ్యాల్యూయేన్ 700 కోట్ల డాలర్ల నుంచి 800 కోట్ల డాలర్లుగా మదింపు వేసినట్లు తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 4056 కోట్ల టర్నోవర్‌పై రూ. 1818 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు తెలుస్తోంది.