For Money

Business News

కుప్పంలో ఐఫోన్‌ ఛాసిస్‌ తయారీ

ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఐఫోన్‌ ఛాసిస్‌లు తయారు చేసే ప్లాంట్‌ రానుంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ హిందాల్కో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ. 586 కోట్లతో ఈ ప్లాంట్‌ను నెలకొల్పుతున్నారు. ఈ ప్లాంట్‌కు వివిధ రాయితీలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనను ఇవాళ జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ SIPB ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. బెంగళూరు ఎయిర్‌ పోర్టుకు కేవలం 120 కి.మీ దూరంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. బెంగళూరు, చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లోభాగంగా ఏర్పాటు అవుతున్న ఈ ప్లాంట్‌లో 2027 మార్చికల్లా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కంపెనీ వర్గాలు అంటున్నాయి. చైనా వెలుపల ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్‌ తయారీ కేంద్ర బెంగళూరులోనే ఉంది. ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఈ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది.

Leave a Reply