Q1 లో జీడీపీ వృద్ధి రేటు 20.1 శాతం
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 20.1 శాతం గా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధిరేటు మైనస్ 24.4 శాతం పడిపోయిన విషయం తెలిసిందే. అంటే ఇంకా మన ఆర్థిక వృద్ధి రేటు కరోనా మునుపటి కాలానికి చేరలేదు. 2020 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో మన జీడీపీ రూ. 38.3 లక్షల కోట్లు ఉండేది. ఈ ఏడాది అంటే 2021 జనవరి నుంచి మార్చిలో జీడీపీ రూ. 39 లక్షల కోట్లకు చేరినా.. మళ్ళీ ఈ త్రైమాసికంలో రూ. 32.4 లక్షల కోట్లకు పడిపోయింది.