For Money

Business News

టోరెంట్ ఫార్మా చేతికి జేబీ కెమికల్స్‌

జేబీ కెమికల్స్‌లో మెజారిటీ వాటాను టొరెంట్ ఫార్మా దక్కించుకోనుంది. అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కేకేఆర్‌ నుంచి 46.39 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. మొత్తం వాటా కోసం రూ. 25,689 కోట్లు వెచ్చిచంచనుంది. వాటా కొనుగోలు తరవాత టొరెంట్ ఫార్మా ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది. కంపెనీలో కంట్రోలింగ్ స్టేక్‌ చేతికి వచ్చిన తరవాత జేబీ కంపెనీని టోరెంట్ ఫార్మాలో విలీనం చేస్తారని తెలుస్తోంది. ఈ టేకోవర్‌ను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. షేర్‌ పర్జేజ్‌ అగ్రిమెంట్‌ కింద రూ. 11917 కోట్లు చెల్లించి కేకేఆర్‌ నుంచి 46.39 శాతం వాటాను తీసుకోనుంది. ఒక్కో షేర్‌ను రూ. 1600 ధరకు కొంటోంది. మిగిలిన 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది. ఒక్కో షేర్‌కు రూ. 1639.18 చొప్పున టోరెంట్ ఫార్మా చెల్లించనుంది. దీని తరవాత ఉద్యోగుల నుంచి మరో 2.8 వాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇలా మొత్తం వాటా కొనుగోలు కోసం కంపెనీ రూ. 25,689 కోట్లు చెల్లించనుంది. మొత్తం డీల్‌ పూర్తయ్యాక టోరెంట్ ఫార్మాలోకి జేబీ కెమికల్స్‌ను విలీనం చేయనున్నారు.