చివర్లో మద్దతు

మార్కెట్ ఇవాళంతా నష్టాల్లో కొనసాగింది. ఆరంభంలోనే భారీగా క్షీణించిన నిఫ్టి… మిడ్ సెషన్ తరవాత అంటే 2.30 గంటల ప్రాంతంలో ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 24462 పాయింట్ల స్థాయిని తాకింది. అంటే సుమారు 350 పాయింట్లకు పైగా నష్టపోయింది. అక్కడి నుంచి దాదాపు 150 పాయింట్లు కున్న నిఫ్టి 24609 వద్ద ముగిసింది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ కావడతో పలు కౌంటర్లలో షార్ట్ కవరింగ్ వచ్చింది. దీంతో నిఫ్టి 203 పాయింట్ల నష్టంతో 24609 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం 20 రోజుల చలన సగటుపైన నిఫ్టి ఇవాళ ముగిసింది. ఇవాళ కూడా డిఫెన్స్ షేర్లు వెలుగులో ఉన్నాయి. నిఫ్టిలో ఇవాళ 2949 షేర్లు ట్రేడవగా, 1582 షేర్లు నష్టాల్లో, 1276 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇవాళ 84 షేర్లు అప్పర్ సర్క్యూట్ వద్ద క్లోజ్ కాగా 53 షేర్లు లోయర్ సర్క్యూట్ వద్ద ముగిశాయి. నిఫ్టి గెయినర్స్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్‌లో నిలిచింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, హీరో మోటోకార్ప్ షేర్లు తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఇక నిఫ్టి లూజర్స్‌లో ఓఎన్‌జీసీ, ఎం అండ్ ఎం, హిందాల్కో, విప్రో, ట్రెంట్ ముందున్నాయి.