కొనసాగిన టెక్ జోరు

వాల్స్ట్రీట్లో ఇవాళ కూడా ఐటీ, టెక్ షేర్ల హవా కొనసాగింది. ఏప్రిల్ నెలలో గత ఏడాదితో పోలిస్తే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) 2.3 శాతం పెరిగింది. అంచనాల కన్నా తక్కువగా పెరగడంతో డాలర్ మళ్ళీ బలహీనపడింది. దీంతో టెక్, ఐటీ షేర్లలో హవా కొనసాగింది. నాస్డాక్ 1.69 శాతం లాభంతో ట్రేడవుతుండగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.83 శాతం లాభంతో ఉంది. అయితే డౌజోన్స్ మాత్రం 0.4 శాతం నష్టంతో ట్రేడవుతోంది. డాలర్ క్షీణించడంతో బులియన్ మార్కెట్, ఆయిల్ మార్కెట్ జోష్ మీద ఉన్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ రెండు శాతంపైగా పెరిగింది.