బ్రిటన్‌తో FTA డీల్ ఓకే

బ్రిటన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) భారత్ కుదుర్చుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఈ చరిత్రాత్మక ఒప్పందంతోపాటు డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కూడా కుదిరినట్లు వెల్లడించారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి వీలు కల్గిందని ఆయన పేర్కొన్నారు. దీంతో రెండు దేశాల్లో వ్యాపార అవకాశాలు పెరగడం, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ఆస్కారం ఉందని ప్రధాని తెలిపారు. భారత్, బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2040 కల్లా 2,550 కోట్ల పౌండ్లకు చేరుకుంటుందన్న ఆశాభాన్ని వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం కారణంగా విస్కీ, ఆధునాతన మాన్యూఫ్యాక్చరింగ్ విభాగాలు, పొట్టేలు మాంసం, సాల్మన్ చేపలు, చాక్లెట్లు, బిస్కట్లు వంటి ఆహార వస్తువులపై సుంకాలు తగ్గే అవకాశముంది.