సుమంత్ రాజీనామా

ఇండస్‌ఇండ్ బ్యాంక్ సీఈఓ ఎండీ సుమంత్ కత్‌పాలియా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. బ్యాంక్‌లో గత ఏడాది జరిగినరూ.1,960 కోట్ల అకౌంటింగ్ లోపాలకు బాధ్యత వహిస్తూ సుమంత్ రాజీనామా చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఆయన రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ డిప్యూటీ సీఈఓ అరుణ్ ఖురానా మొన్ననే రాజీనామా చేశారు. అలాగే బ్యాంక్ సీఎఫ్‌ఓ జనవరి నెలలో వైదొలగారు. సీఈఓ రాజీనామా చేయడంతో బ్యాంకు నిర్వహణ కోసం ఓ ఎగ్జిక్యూటివ్‌ల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇండస్ ఇండ్ బ్యాంక్ పేర్కొంది.